Thursday, April 25, 2024

ప్రజలు పిలిచే వరకు రాజకీయాల్లోకి రాను

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan met Janasena activists

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని, రాష్ట్ర ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. నగరంలో జనసేన కార్యకర్తలతో శనివారం నాడు పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ పవన్‌కల్యాణ్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. తెలంగాణ గడ్డపై నుంచే జనసేన పార్టీని ప్రారంబించానని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపించటానికి కృషి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ పోరాట స్పూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తన గుండెలో ధైర్యాన్ని నింపిందని తెలిపారు. తెలంగాణ భాషను, యాసను తాను గౌరవిస్తున్నానని, అడుగుపెడితేనే అనుభవం రాదని వ్యాఖ్యానించారు.

కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని, కులాల కొట్లాటతో ఎపి అభివృద్ధి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకకు బద్దశత్రువులని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులను తెలంగాణ నాయకులు బద్దశత్రువులుగా చూశారని విమర్శించారు. ఎపిలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తనకు శత్రువులు కాదని, సమస్యలు మాత్రమే శత్రువలని పేర్కొన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఖండిస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో తెలంగాణాలో జనసేన పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నామని, సామజిక మార్పుకోసం పోరాడతామని ఎన్నికల్లో ఓడిపోయినా వెనకడుగు వేసేది లేదన్నారు. తనకు పుస్తకాల్లో చదివిన దానికంటే.. ప్రత్యక్షంగా తిరిగినందువలన సమాజానికి కావాల్సిన అవసరాలు తెలిశాయని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News