Saturday, April 20, 2024

జూలై నుండి హరీష్ శంకర్‌తో సినిమా

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan movie with Harish Shankar

 

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి హరీష్ శంకర్ పూర్తి స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడని తెలిసింది. పవన్ కూడా పూర్తి స్క్రిప్ట్‌ను చదివాడని, షూట్‌కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. జూలై నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం నెలకు పది రోజుల చొప్పున పవన్ డేట్స్ ఇవ్వనున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ ఫ్లాష్‌బ్యాక్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు తెలిసింది. కాగా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్‌లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. కాగా తండ్రిది పోలీస్ ఆఫీసర్ పాత్ర అట. ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. పవన్ ‘గబ్బర్ సింగ్’తో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశాడు. మరి ఈ సారి కూడా ఈ క్రేజీ కాంబినేషన్ నుండి వచ్చే సినిమా రికార్డులను సృష్టిస్తోందేమో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News