Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇది ఆరంభం మాత్రమే: జనసేనాని

ఇది ఆరంభం మాత్రమే: జనసేనాని

pawan kalyanఅమరావతి: ఎపిలో లో పలుచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు తాజాగా ఫొటోలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొడంతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. గుంటూరులోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జనసేనాని మాట్లాడారు.

నియోజకవర్గాల్లోని జనసేన పార్టీ ఆఫీసులు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేననీ పవన్ అన్నారు. జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు.

Pawan Kalyan Party Workers Meeting in Mangalagiri