*జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బుస్స వేణు
మనతెలంగాణ/సిరిసిల్ల: జనసేన అధ్యక్షుడైన పవన్ క ళ్యాణ్ అధికార పార్టీలకు బాకాలూదడం మానుకొని ప్రజాసమస్యలపై స్పందించాలని రాజన్న సిరిసిల్ల జి ల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బుస్స వేణు అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తె లంగాణ ఉద్యమం జరిగిన కాలంలో తెలంగాణ ఏర్పాటును పచ్చిగా వ్యతిరేకించిన పవన్ ఈరోజు కేంద్రం లో, లుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలను కీర్తిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. తెలంగాణ తన కు పునర్జన్మనిచ్చిందని సెంట్‌మెంట్ డైలాగులు వాడు తూ అధికార పార్టీకి తోక పార్టీగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజా సమస్యలను పట్టించుకోని పవన్ తన జనసేనను అధికార పార్టీల్లో విలీనం చేస్తే స రిపోతుందన్నారు.తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతుంటే సిఎం కెసిఆర్‌ను పవన్ పొగడడం ఎంతవరకు సమంజసమన్నారు.నేరెళ్ల ఇసుక బాధితుల సంఘటన యావత్తు దేశప్రజలు నిరసిస్తే పవన్ నోరెత్తలేదన్నారు. మందకృష్ణను అక్రమంగా అరెస్ట్ చేస్తే మాట్లాడలేదన్నారు. ప్రజల పక్షాన ప్రొఫేసర్ కోదండరాం పాదయాత్ర చేస్తే అనుమతించని ప్రభుత్వం అర్ధరాత్రి ఆ యన ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేసారని,ఆంధ్ర నాయకుడు,తెలంగాణ బద్దవ్యతిరేకి అ యి నా పవన్ పర్యటనకు ఎలా అనుమతించారని ఆయన నిలదీశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కెసిఆర్, కేటిఆర్, కవితలు పవన్‌కళ్యాణ్‌ను తూర్పార పట్టారని, పవన్‌కూడా తక్కువేమి తినలేదన్నారు.
ఇప్పుడు ఒకరికొకరు అభినందనల డ్రామాలాడుతున్నారని జనం అన్నీ చూస్తున్నారని మరచిపోవద్దన్నా రు. పవన్‌కళ్యాణ్‌కు తెలంగాణలో తిరిగే అర్హతే లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజారా జ్యం పేరిట పవన్ అన్న చిరంజీవి తెలంగాణ ప్రజలను మోసగించి కాంగ్రెస్‌లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసాడ ని, ఇప్పుడు పవన్ వంతు వచ్చిందని, ఎన్నికలకు కొం త కాలం ముందు ఛలోరేఛల్ డ్రామాలు నడిపి ఆ తరువాత తెరాసలో జనసేన విలీనం చేస్తారని విమర్శించా రు. ఈ కార్యక్రమంలో కుసుమ విష్ణుప్రసాద్, కారంపు రి సాయన్న తదితరులు పాల్గొన్నారు.