Home Default పికె#25 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల..!

పికె#25 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల..!

PSPK-25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కతున్న చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఎస్ రాధాకృష్ణ నిర్మాణంలో తెరకెక్కతున్న ఈ చిత్రం టైటిల్ ఇప్పటివరకూ ప్రకటించకపోయినా.. చిత్రం పోస్టర్లతో అభిమానులకు చిత్ర బృందం సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇక ఈ చిత్రంలో ముద్దుగుమ్మలు.. అను ఇమ్మాన్యూయల్, కీర్తీ సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కి 25వ చిత్రం కావడంతో చిత్రంపై మరిన్ని అంచానాలు పెరిగాయి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.