Friday, March 29, 2024

‘వకీల్‌ సాబ్‌’కు షాక్.. లీకైన మరో మరో స్టిల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా హిందీ మూవీ పింక్ రిమేక్ గా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ లాయర్ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటకు మంచి స్పందన వచ్చింది. ఇక, దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ లో విడుదల కానుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే, షూటింగ్ ప్రారంభమైన తొలిరోజే పవన్ లుక్ లీకైన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి మరో స్టిల్ కూడా లీకైంది. కోర్టులో పవన్ కళ్యాణ్ వాదిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిత్రయూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీకును మాత్రం ఆపలేకపోతున్నారు. కాగా, ఈ సినిమాను డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. బోనీ కపూర్‌, దిల్‌ రాజు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేదా థామస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan’s Vakeel Saab court still leak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News