Wednesday, April 24, 2024

జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన… రూట్ మ్యాప్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ ఖరారయ్యింది. ఈ నెల 24న పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్ళనున్నారు. ఉదయం 11 గంటలకు కొంగట్టుకు చేరుకొని కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజ తర్వాత వారాహికి పూజలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మొడిమ్యాల మండలం నాచుపల్లి శివారులో ని బృందావన్ రిసార్ట్‌లో పార్టీ ముఖ్య నేతల సమావేవంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశా నిర్దేశం చేస్తారు.

అదే రోజు అనుష్టుప్ నరసింహయాత్ర ప్రారంబించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీలక్ష్మి నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మిగిలిన 31 నరసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శించారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చశారు జనసేన నేతలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News