Thursday, April 25, 2024

వారిని ఆదుకోండి.. పవన్‌ ట్వీట్ పై స్పందించిన తమిళనాడు సిఎం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తమిళనాడులో చిక్కుకుపోయిన ఎపి మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు ప్రభుత్వానికి ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సిఎం పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. ‘ప్రియమైన పవన్ కల్యాణ్, మత్స్యకారుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖను ఆదేశించాం. వారిని మేం తప్పకుండా ఆదుకుంటాం. కృతజ్ఞతలంటూ ట్విట్టర్‌లో సిఎం బదులిచ్చారు’. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిహెచ్ చొలగండి గ్రామానికి చెందిన 30 మంది మత్స్యకారులు చేపల వేట నిమిత్తం తమిళనాడు వరకు వెళ్లారు. అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వారు చెన్నై హార్బర్‌లో నిలిచిపోయారు. వారికి భోజనం, వసతి లేక అల మటిస్తున్న విషయం వారి కుటుంబసభ్యుల ద్వారా జనసేన నాయకులకు తెలిసింది. వారు పవన్ కల్యాణ్‌కు ఈ విషయాన్ని నివేధించడంతో ఆయన వెంటనే ట్విట్టర్‌లో తమిళనాడు సిఎంకు ట్వీట్ చేశారు.

Pawan tweet to TN Govt to help AP Fishermen

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News