Home జాతీయ వార్తలు నియాకు ఎల్గార్ అప్పగింత సరికాదు

నియాకు ఎల్గార్ అప్పగింత సరికాదు

Pawar Uddhav

 

ఉద్ధవ్‌పై పవార్ ఫైర్

కొల్హాపూర్ : ఎల్గార్ పరిషద్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (నియా)కు అప్పగించడంపై ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తప్పు చేసిందని విమర్శించారు. ఈ కేసును నియాకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయించడం పద్థతి కాదని పవార్ మండిపడ్డారు. ఆయన గురువార ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శివసేన ప్రభుత్వంలో ఎన్‌సిపి కీలక మిత్రపక్షంగా ఉంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ నిర్ణయాన్ని బహిరంగంగా పవార్ తప్పుపట్టడం ఇదే తొలిసారి. నిజానికి ఎల్గార్ పరిషత్ కేసును నియాకు బదిలీచేయాలని కేంద్రం నిర్ణయించడమే అనుచితం అని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం మరింత తప్పని పవార్ తెలిపారు. ఈ కేసును నియాకు అప్పగించాలని గత నెల 25వ తేదీన కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Pawar upset Uddhav handing Elgar Parishad case to NIA