Friday, March 29, 2024

బన్నితో స్పెషల్ సాంగ్ పై స్పందించిన పాయల్..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌ః ముంబయి బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన పాయల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవల వచ్చిన ‘వెంకీమామ’ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా నటించి అలరించింది. కాగా, పాయల్ మరో రెండు క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుందని వార్తాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్ పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో పాయల్ ఓ స్పెషల్ సాంగ్‌లో బన్నితో ఆడిపాడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు కమల్ హసన్, శంకర్‌ల కాంబోలో రూపొందుతున్న ‘ఇండియన్ 2‘ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

తాజాగా ఈ వార్తలపై పాయల్ రాజ్‌పుత్ స్పందించింది. ”ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో నాకు తెలియదు. సినిమాలల్లో నేను ఎలాంటి సాంగ్స్ చేయడం లేదు. ‘పుష్ప’, ‘ఇండియన్ 2’ సినిమాలల్లో స్పెషల్ సాంగ్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను ఇంకా ఏ సినిమాకు సంతకం చేయలేదు. ప్రస్తుతం నేను ఏ షూటింగ్ చేయట్లేదు” అంటూ రూమార్లకు పాయల్ చెక్ పెట్టింది.

Payal denies her special song rumours in Pushpa

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News