Home తాజా వార్తలు హాట్ హాట్‌గా

హాట్ హాట్‌గా

Payal Rajputh

 

‘ఆర్‌ఎక్స్’ 100 చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పాయల్ అందాల విందు కుర్రకారును కట్టి పడేసింది. ఫలితంగా తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ భామ. అందాల ఆరబోతకు అడ్డు చెప్పని హాట్ బ్యూటీగా పాయల్ కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం మరోసారి అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. పాయల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌డిఎక్స్ లవ్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఈ భామ స్టిల్స్ విడుదలై హల్‌చల్ చేశాయి.

తాజాగా మరో హాట్ ఫోటోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫొటోలో పాయల్ అందచందాలు యూత్‌ను మైమరపిస్తున్నాయి. ఇక ‘ఆర్‌డిఎక్స్ లవ్’ టీజర్‌ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. శంకర్ భాను దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రధాన్ సంగీతం అందిస్తున్నాడు.

సెప్టెంబర్‌లో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పాయల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. తెలుగు,- తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటోంది ఈ భామ. ‘వెంకీ మామా’ చిత్రంలో వెంకటేశ్‌కు జోడిగా నటిస్తోంది. మాస్ రాజా రవితేజ సరసన ‘డిస్కోరాజా’లో కూడా ఓ హీరోయిన్‌గా చేస్తోంది పాయల్ రాజ్‌పుత్.

Payal Rajputh as Hot Beauty