Home తాజా వార్తలు ఆర్థికం అమోఘం…

ఆర్థికం అమోఘం…

Financial

 

చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయి

మే నెలాఖరు నుంచి రైతుబంధు

23 తర్వాత నిధుల విడుదల, బకాయిల్లేవు

పెట్టుబడులు పెరిగిన కొద్దీ వృద్ధిరేటు పెరుగుదల. ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు
కోడ్ వల్లనే జాప్యం, ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు
పెండింగ్ బిల్లులు రూ.3,474కోట్లు మాత్రమే
ఐదేళ్లలో ఆదాయం మూడు రెట్లు పెరిగింది
ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు

హైదరాబాద్: ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పింఛన్లు, ప్రాజెక్టుల బిల్లులు, సంక్షేమ పథకాలకు నిధులను సకాలంలోనే చెల్లిస్తున్నామని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందని ఆయన తెలిపా రు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అ నుమానాలు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు.

రైతుబంధు పథకం నిధులను ఆన్‌లైన్ ద్వారా రైతులకు చెల్లిస్తామని, వారికి ఇబ్బంది లేకుండా రుణమాఫీని అమలు చేస్తున్నామన్నారు. మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. రైతుబంధు చెల్లింపులో బకాయిలు లేవని, – 52 ల క్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధిపొందారన్నారు. రైతుబంధు కోసం రబీ సీజన్‌లో రూ.5, 200 కోట్లు నిధులను విడుదల చేశామన్నారు. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

23 వ తేదీ తరువాత రైతుబంధు విడుదల చేస్తామనాని, ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని చెల్లింపుల్లో జా ప్యం జరిగిందన్నారు.- రుణమాఫీ కోసం బడ్జెట్‌లో నిధు లు రూ.6,000 కోట్లను కేటాయించామని వాటిని కూడా విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్ నెల లో ఖర్చు తక్కువగా ఉంటుందని ఆయన తెలిపా రు. -చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బందులు లేకుండా చెల్లింపులు చేస్తున్నామని, ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపులు జరుపుతున్నామన్నారు. రూరల్ రోడ్లు, రూరల్ కనెక్టివిటీ ఖర్చు వ్యవసాయం అభివృద్ధి కిందకు వస్తుందని ఆయన తెలిపారు.- ఏజీతో నేడు సమావేశం ఉందని ఆయన పేర్కొన్నారు.

5 సంవత్సరాల్లో రూ.80 వేల కోట్లు
ఇరిగేషన్‌పై ఖర్చు

-ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ, ఆసరా పింఛన్లకు ఓట్ ఆన్ అకౌంట్‌లో ఆరు నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి నెల రాష్ట్రానికి 12,000 కోట్ల వరకు నిధులు వస్తాయని వాటిని అన్నింటికీ సర్దుబాటు చేస్తామన్నారు. ఏ శాఖలోనైనా ఆలస్యం జరిగితే అక్కడి అడ్మిన్ సమస్యగానే పరిగణించాలన్నారు. 5 సంవత్సరాల్లో రూ.80 వేల కోట్లు ఇరిగేషన్‌పై ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రతి సంవత్సరం రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కొన్ని బిల్లులు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోతున్నాయని, డిపార్ట్‌మెంట్ ప్రాధాన్యతలను బట్టి వాటిని క్లియర్ చేస్తామన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర సొంత ఆదాయం మూడు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో నాలుగు లక్షల ఎకానమీ ఉంటే అది 2019 సంవత్సరానికి 9 లక్షల చేరుకుందన్నారు. రాష్ట్రం
ఏర్పడిన నాటి నుంచి లక్ష కోట్ల రుణాలు తీసుకున్నామని, అది కూడా ఎఫ్‌ఆర్‌బిఎమ్ నిబంధనలకు లోబడే తీసుకున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిధుల ఇబ్బంది లేకుండా అమలవుతున్నాని ఆయనచెప్పుకొచ్చారు.

రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.8లక్షల
65వేల 875 కోట్లు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడాది అధిక ఆర్థిక వృద్ధి నమోదైందని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు తెలిపారు. ఆర్థిక వృద్ధిరేటు నమోదులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. స్టేట్ సొంత పన్నులు వసూళ్లలోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 14శాతం కంటే తక్కువ ఉంటే, కేంద్రం జీఎస్టీ మినహాయింపు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు కేవలం రూ.3,474కోట్లు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్ర గణాంకాల సంస్థ లెక్కలు 2018, -19 ఆర్థిక సంవత్సరం ప్రకారం రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.8లక్షల 65వేల 875 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు.

2018, -19లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 15శాతంగా నమోదయ్యిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ (మూల ధన వ్యయం) లక్షా 64వేల 519 కోట్లు అని ఆయన వెల్లడించారు. మిషన్‌భగీరథ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.46,960కోట్లు అని, ఈ ప్రాజెక్టుపై రూ. 27,509 కోట్లు ఖర్చు చేశామని, రూ. 659 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి బిల్లులు పే చేస్తుంటామని, నెలకు సుమారు రూ.2వేల కోట్ల వరకు బిల్లులను చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదని, పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. ఐదు సంవత్సరల సరాసరి 16.5 మూలధన వ్యయం పెరుగుతున్నందునే మనకు ఆదాయం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రానికి నెంబర్‌వన్ స్థానం లభించిదన్నారు.

Payments are Going on in a Timely Manner