Wednesday, April 24, 2024

మరింతగా పడిపోయిన పేటీఎం షేర్లు!

- Advertisement -
- Advertisement -

Paytm

ముంబయి: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో సోమవారం పేటీఎం షేర్లు దాదాపు 14 శాతం పతనమయ్యాయి. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందిన పేటీఎం షేర్లు కొత్తగా గురువారం లిస్ట్ అయిన షేర్లు. లిస్టయిన రోజునే ఇష్యూ ధరకన్నా 27 శాతం మేరకు(ధర రూ. 2150కి) భారీ పతనాన్ని చవిచూసిన ఈ షేర్లు సోమవారం కూడా బాగానే పతనమయ్యాయి. దాదాపు 14 శాతం పడిపోయింది. బిఎస్‌ఇలో ఈ షేరు రూ. 1350.35, ఎన్‌ఎస్‌ఇలో రూ. 1351.75 ట్రేడయింది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం పేటీఎం స్టాక్ ఓవర్ వాల్యూయేషన్ వెయిటేజ్ ఇవ్వబడింది. నేటి వరకు పేటీఎంది భారత్‌లోనే అతి పెద్ద ఐపిఓ. దాని ఐపిఓ విలువ రూ. 18300కోట్లు. కాగా దానికన్నా దశాబ్ద కాలం ముందొచ్చిన అతి పెద్ద ఐపిఓ కోల్ ఇండియాది. దాని విలువ రూ. 15000 కోట్లు. ఏది ఏమైనప్పటికీ పేటీఎం 2000లో వచ్చినపటికీ డిజిట్ చెల్లింపుల యాప్‌లలో నేటికీ వినియోగదారులు, వ్యాపారుల నడుమ నెం. 1 యాప్‌గానే ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News