Home తాజా వార్తలు ముగ్గురిపై పిడి యాక్ట్

ముగ్గురిపై పిడి యాక్ట్

PD Act

 

హైదరాబాద్: ముగ్గురు వ్యక్తులపై పిడి యాక్ట్ పెడుతూ హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని ఫలక్‌నూమాకు చెందిన రౌడీషీటర్ ఎండి ఇస్మాయిల్ ముఠాగా ఏర్పడి పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఇస్మాయిల్ గ్యాంగ్ హత్యలు చేయడం, దాడి చేయడం చేస్తున్నారు. మే, 1వ తేదీ, 2019న ఒకే రోజు 11 నేరాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. వెంటనే అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. తాజాగా పిడి యాక్డ్ పెడుతూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

మానవ అక్రమ రవాణా వారిపై….
మానవ అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన వారిపై పిడి యాక్ట్ పెడుతూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఎండి రాణాహుస్సేన్, ఎండి మామున్ ఇద్దరు చిన్నప్పుడే పశ్చిమబెంగాల్ నుంచి పనిచేసేందుకు నగరానికి వచ్చి కూలీ పనిచేస్తున్నారు. వీరికి వ్యభిచార గృహం నడిపించే అసద్ ఖాన్ పరిచయమయ్యాడు. అతడు డబ్బుల ఆశ చూపడంతో బంగ్లాదేశ్ నుంచి అమాయకులైన యువతులకు పనికల్పిస్తామని మాయమాటలు చెప్పి నగరానికి తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. జాలపల్లి గ్రామంలో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా పిడి యాక్ట్ పెడుతూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.

PD Act invoked against Three Persons