Home తాజా వార్తలు గజ దొంగ అరెస్టు…

గజ దొంగ అరెస్టు…

Thief

 

హైదరాబాద్: భాగ్యనగరంలో చోరీలకు పాల్పడతున్న గజ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగ వల్లపు వెంకటేష్‌ను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలలోని 51 కేసుల్లో వెంకటేష్ నిందితుడిగా ఉన్నాడని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు తెలిపాడు. గతంలో వెంకటేష్‌ను ఎల్‌బి నగర్ పోలీసులు అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ చోరీలకు వెంకటేష్ పాల్పడుతున్నాడని, గతంలో పిడి యాక్ట్ నమోదు చేసినా వెంకటేష్ ప్రవర్తనలో మార్పు లేదని, నిందితుడి నుంచి రూ.1.17 లక్షల నగదు, 41 తులాల బంగారం, రెండు పల్సర్ వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

 

PD Act Thief arrest by Miyapur Police in Hyderabad