Home ఆదిలాబాద్ ప్రకృతి ప్రసాదం పెద్ద గుండం జలపాతం

ప్రకృతి ప్రసాదం పెద్ద గుండం జలపాతం

Pedda Gundam Falls

 

సిరికొండ : బోథ్ నియోజకవర్గం అంటే నేను, జలపాతంలకు పుట్టినిల్లు. పచ్చని అందాలతో పాటు ఆహ్లాదంన్నీ పంచే అడవులు పక్షుల కిలకిలలు ఎత్తైన కోండలు గుట్టలు కోండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు గలగలపారే సెలయేరు అప్పుడప్పుడు కనిపించే వన్య ప్రాణులు ఇలాంటి ఈ వృక్షాలన్ని ఒకే చోట చేరితే కనువిందుగా ఉంటుంది. అలాంటి ప్రకృతి సౌందర్యం చూసి పరవశించాలి అంటే పెద్ద గుండాల జలపాతం సందర్శించాల్సిందే హాయ్ గోలిపే ఆ జలవిహారం బాహ్య ప్రపంచానికి చేరువవుతుంది. ఇచ్చోడ మండలంలోని కోకస్మన్నార్ గ్రామ శివారులో అపురూపమైన పెద్ద గుండం జలపాతం ఉంది. పై భాగంలో ఉన్న వాగుల నుంచి ఈ జలపాతానికి నీరు వస్తుంది. నిమ్మరసంగా ఉండే అడవి జారిపడే నీటి ధ్వని మనసును కట్టిపడేస్తుంది.

ఇప్పుడిప్పుడే వెలుగులోకి పెద్ద గుండం జలపాతం
ఇక్కడ జలపాతం ఉన్నట్లు చాలా మందికి తెలియదు ఉమ్మడి రాష్ట్రంలో కుల నిర్లక్షంతో వెలుగు చూడని ఈ జలపాతం గత సంవత్సరం రాష్ట్ర మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు ఆకుల రుద్రమౌళి ఆధ్వర్యంలో పర్యాటక శాఖ బృందం సభ్యులు సందర్శించి ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇక్కడి సుందర దృశ్యాలు వీడియో ఫోటోలు గూగుల్ మ్యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. దీని ఆధారంగా జిల్లాలోని వివిధ మండలాల పర్యాటకులు వచ్చే వీలుంది. అంతేకాకుండా జిల్లాలోని యువకులు ఈ జలపాతానికి వర్షాకాలంలో వస్తున్నరు.

ఇచ్చోడ నాలుగు వరుస జాతీయ రహదారి నుంచి పడమర వైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం కోకస్‌మన్నూర్ వస్తుంది. అక్కడి నుంచి కిలో మీటర్ల దూరం కాలినడక ప్రయాణిస్తే అందమైన అడవులు పిట్లల శబ్దాలు పులకరించి ప్రకృతి అపురూపమైన పెద్ద గుండం జలపాతం దర్శనమిస్తుంది. అడవిలో కాలినడక ప్రయాణం మరుపు రానిది అంతేకాకుండా ఆ గ్రామ యువకులు ప్రత్యేక శ్రద్ద చూపి జలపాతానికి వెళ్లే మార్గంలో పలు సూచన బోర్డులను ఏర్పాటు చేశారు.

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: రాము యువకుడు కోకాస్‌మన్నూర్
ఇచ్చోడ మండలంలోని పెద్ద గుండం జలపాతం. గాయంత్రీ జలపాతంతో పాటు నేరడిగోండ మండలంలోని కుంటాల జలపాతం. గుప్తల జలపాతం బోథ్ మండలంలోని పోచ్చరా జలపాతం బజార్‌హత్నూర్ మండలంలోని కనకకాయ్ జలపాతం బోథ్ నియోజకవర్గంలో ఉండటం చాలా సంతోషకరం కానీ అన్ని జలపాతాలను ప్రభుత్వం గుర్తించి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి జలపాతాల వద్ద వసతులు కల్పించి వృద్ది చేసేలా కృషి చేయాలి.

Pedda Gundam Falls converted into tourist destination