Home తాజా వార్తలు ఉగ్రదాడిలో తెలంగాణ జవాను మృతి..

ఉగ్రదాడిలో తెలంగాణ జవాను మృతి..

పెద్దపల్లి: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణ జవాను మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు బారముల్లాలో ఉగ్రవాదులతో జరిగిన హోరాహోరీ పోరులో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన జవాను సాలిగం శ్రీనివాస్ మరణించారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో జవాను  శ్రీనివాస్ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది. శ్రీనివాస్(28) 2013లో ఆర్మీలో చేరాడు. శ్రీనివాస్‌కు రెండు సంవత్సరాల క్రితమే మమతతో వివాహమైంది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ తండ్రి పశువుల కాపరి కాగా, తమ్ముడు రాజు తాపిమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు.

Peddapalli Jawan died in Encounter at Baramulla