Saturday, April 20, 2024

వీడిన పెద్దపల్లి ఎంఎల్‌ఎ సోదరి కుటుంబం మిస్టరీ

- Advertisement -
- Advertisement -
Peddapalli MLA Sister Family Committed Suicide
బలవన్మరణంగా తేల్చిన పోలీసులు

హైదరాబాద్ : పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి ఫ్యామిలీ మరణం మిస్టరీ వీడింది. ఈ ఏడాది జనవరి 27న తిమ్మాపూర్ మండలం పెద్ద ఎస్‌ఆర్‌ఎస్పి కెనాల్ లో పడి చనిపోయిన సత్యనారాయణ రెడ్డి కుటుంబం మృతిని బలవన్మరణంగా కరీంనగర్ పోలీసులు తేల్చారు. సత్యనారాయణ రెడ్డి నిర్వహించే షాప్ లో దొరికిన లెటర్ ఆధారంగా వీరంతా సూసైడ్ చేసుకున్నట్లు నిర్దారణకు వచ్చినట్టు సిపి కమల్ హాసన్ రెడ్డి వెల్లడించారు. లెటర్ లోని చేతి రాత, ఇతర బుక్స్ లో రాసిన హ్యాండ్ రైటింగ్ ఒకటేనని ఫోరెన్సిక్ టెస్టుల్లో తేలినట్టు సిపి పేర్కొన్నారు.

రామడుగు మండలం లక్ష్మీపురం విలేజ్ కి చెందిన సత్యనారాయణ రెడ్డి కరీంనగర్ లోని బ్యాంక్ కాలనీలో నివాసముండేవారని, అతడికి ఫర్టిలైజర్ షాప్ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉందని తెలిపారు. ఆ కుటుంబానికి ఎక్కువగా విహారయాత్రలు చేసే అలవాటు ఉందని, నేపథ్యంలో జనవరి 27న కూడా భార్య రాధ, కూతురు వినయ్ శ్రీ తో కలిసి సత్యనారాయణ రెడ్డి కారులో వెళ్లారన్నారు. అయితే 20 రోజుల పాటు వారి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతోబంధువులంతా కూడా వారు విహారయాత్రకే వెళ్లారనుకున్నారని తెలిపారు. కానీ ఫిబ్రవరి 17 ఆదివారం రోజున మానేరు కెనాల్ లో ఓ కారు కనిపించిందని స్థానికులు పోలీసులకు అందిన సమాచారం మేరకు వెళ్లి పరిశీలించగా అందులో సత్యనారాయణ రెడ్డి , అతని భార్య, కూతురు డెడ్ బాడీలు కుళ్లిన స్థితిలో బయటపడ్డాయన్నారు.

ఈ క్రమంలో విచారణ చేయగా ఆ కుటుంబం పెద్దపల్లి ఎంఎల్‌ఎ మనోహర్ రెడ్డి సోదరి ఫ్యామిలీ అని తేలిందన్నారు. కాగా ఈ ఘటనపై తొలుత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయని, దీంతో పోలీసులు కూడా పలు కోణాల్లో విచారణ చేశారన్నారు. కాగా దర్యాప్తులో భాగంగా సత్యనారాయణ రెడ్డి నిర్వహిస్తున్న ఫర్టిలైజర్ షాప్ లో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికిందని, పోలీసులు ఆ నోట్‌ను, సత్యనారాయణ రెడ్డి గతంలో రాసిన వివిధ పుస్తకాలను పరిశీలించి వాటిని ఫోరెన్సిక్ టెస్ట్‌కు పంపించారన్నారు. ఈ నేపథ్యంలో రెండు రాతలు ఒకటే అని తేలడంతో తేలడంతో సత్యనారాయణ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టు ధృవీకరించడం జరిగిందని సిపి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News