Friday, June 13, 2025

క్రేజీ కాంబినేషన్‌లో సినిమా

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్న ప్రాజెక్ట్ పెద్ది మీద భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చరణ్ రగ్డ్ లుక్, రెహమాన్ మ్యాజిక్ వంటి అంశాల తో అందరిలోనూ ఆసక్తిని పెంచింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏ డాది మార్చి 27న, చరణ్ పుట్టినరోజున విడుదల చేయనున్నా రు. అయితే చరణ్ తదుపరి ప్రాజెక్టు రంగస్థలం దర్శకుడు సు కుమార్‌తో ఖరారైంది. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌లో ఇది మరో రస్టిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. 2025 చివర లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

సుకుమార్‌తో చరణ్ కలిసి మరోసా రి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ ఆతర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. తాజాగా త్రివిక్రమ్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ చెబితే చరణ్ వెంటనే ఓకే చేశాడట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. దీన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News