Home తాజా వార్తలు పేదోడి కడుపును మందలించిన ఆప్తుడు సిఎం కెసిఆర్

పేదోడి కడుపును మందలించిన ఆప్తుడు సిఎం కెసిఆర్

Peddi sudharshan reddy

 

నర్సంపేట : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రవాణా, పౌర సరఫరాల శాఖలపై చర్చలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. పేదోడి కడుపు నింపిన ఘనత మనసున్న మారాజు సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతీ మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నారన్నారు. పౌర సరఫరాల సంస్థ భారంతో ఉన్నప్పటికీ ఆరు కిలోల బియ్యం ఇచ్చి ఔదర్యాన్ని చాటుకున్నారన్నారు. కిలోకు రూ. 28.24 పైసల సబ్సిడీతో రూపాయికి కిలో బియ్యం అందిస్తున్నారన్నారు. అప్పులతో కూడిన సంస్థను ప్రారంభించినప్పటికీ 3600 పీపీ సెంటర్లలో ఐకేపీ సంస్థల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ పంటకు రూ. ఏడు వేల కోట్లు బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి పౌర సరఫరాల సంస్థకు అప్పు ఇవ్వడం ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తోందన్నారు.

ఎంఎస్పీ ఆపరేషన్స్ సక్సెస్ అవడం కెసిఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. నేడు 73.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రం ఎంఎస్పీ ఆపరేషన్స్‌లో రెండువ స్థానంలో నిలిచిందన్నారు. పౌర సరఫరాల సంస్థ తీసుకొచ్చిన సంస్కరణలను పరిశీలించాలని కోరుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాలు మనం చేపట్టిన సంస్కరణలను ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. బియ్యం డైవర్షన్‌పై తీసుకున్న కఠిన నిర్ణయాలను విదేశీ ప్రతినిధులు సైతం అభినందించారన్నారు. ఏడాది కాలంలో దాదాపు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా ప్రతీ ఎకరానికి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి పెరిగిందన్నారు.

దిగుబడి ఎక్కువై డిమాండ్ తగ్గిపోకుండా, భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిజినెస్ ప్రణాళికను ఏర్పాటుచేసిందన్నారు. రవాణా శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 చెక్ పోస్టులను మరింత బలోపేతం చేయాల్సినవసరం ఉందని గతంలో వార్తలు వచ్చాయన్నారు. ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అందుకుగాను ముందుకు పోవడం జరుగుతోందన్నారు. టీఎస్‌ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి కెసిఆర్ ఎంతో ఔదార్యంతో ఆర్టీసీని కాపాడే ఆలోచనలు చేసినప్పటికీ ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఆర్టీసీ స్థలాలు అనేకంగా హైవే, పట్టణాల గుండా ఉన్నాయన్నారు. వాటి అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రాజెక్టును కూడా ఆర్టీసీలోకి తీసుకరావడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్రత్యేకంగా పీఓటీ, బీఓటీ విధానాన్ని అందుబాటులోకి తీసుక వచ్చారని దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.

 

Peddi sudharshan reddy spoke about KCR