Home తాజా వార్తలు నిరుపేద ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తాం: కెసిఆర్

నిరుపేద ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తాం: కెసిఆర్

KCR Speech In Assembly

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుపేద ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న ఒంటరి స్త్రీలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో మానవీయకోణాన్ని అనుసరిస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ భాగం సంక్షేమ రంగానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని ఆయన తెలిపారు.