Home తాజా వార్తలు ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజే పెన్షన్…

ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజే పెన్షన్…

Employee Retires

 

నిర్మల్ : జిల్లాలోని ప్రతి శాఖలో ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజునే పెన్షన్ అందేలా చర్యలు గైకొనాలని కలెక్టర్ ఎం. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల ఫెన్షన్‌దారుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ఫెన్షన్ అదాలత్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ప్ర భుత్వ ఉద్యోగి తానే పదవీ విరమణ పొందిన రోజునే ఫెన్షన్ పొందేలా డోయింగ్ అండ్ డిసెబర్స్‌మెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

విరమణ పొందిన ఉద్యోగులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా వారి పెన్షన్ సకాలంలో అందేలా చూడాలన్నారు. జిల్లాలో 11 ఫెంచన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జిల్లా విద్యశాఖలో 3, జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో 2, జ్యుడిషియల్‌శాఖలో 2, ఆర్టిఓలో 1, పంచాయతీరాజ్‌శాఖలో, అటవీ శాఖలో 2 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఉద్యోగ ఫెన్షన్‌దారులకు రీఎంబర్స్‌మెంట్ బిల్లులను క్రమపద్ధతిలో స్కూటిచేసి పంపాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సుపర్నిండెంట్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ట్రేజరి అధికారి డాక్టర్ ప్రభాకర్, జిల్లా అదనపు ఎస్పి దక్షిణామూర్తి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నిండెంట్ డాక్టర్ సురేష్, ఎటిఓ సంజయ్,జిల్లా పెన్షన్‌దారులు సంఘ ం అధ్యక్షులు డాక్టర్ జనార్థన్‌రెడ్డి,కార్యదర్శి ఎంసి లింగన్న,డిఈఓ ప్రణిత, ఉన్నారు.

Pension on the day Employee Retires