Thursday, April 18, 2024

ప్రజలు ఎప్పుడూ చరిత్ర నిర్మాతలే: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

People are always history makers

సూర్యాపేట: ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని ఆయన చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా దివంగత కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  దేశ కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుచరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచిపోతాడని కొనియాడారు. బి ఆర్ యస్ గా టి ఆర్ యస్ రూపాంతరం చెందడం ద్వారా పింక్ ఇండియాగా మరబోతుందన్న వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆయన స్పందించారు.

 స్వతంత్ర పోరాటం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ తరువాత తామే ప్రత్యామ్నాయం అంటూ ఏర్పడ్డ రాజకీయ పార్టీల సమూహాలు కానీ, ఆ తరువాత కాలంలో గుజరాత్ ను చూపించి దేశాన్ని ఉద్దరిస్తామంటూ అధికారంలోకీ వచ్చిన భారతీయ జనతా పార్టీలు వరుసగా వైఫల్యం చెందాయని దుయ్యబట్టారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజల ఆకలి, మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన పై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి లబ్ది పొందాలి అన్నది బిజెపి అభిమతం అయితే ప్రతిపక్ష పాత్రను కుడా నిర్వహించలేని హీన దుస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందని ఆయన చురకలంటించారు. అటువంటి పరిస్థితుల నుంచి బయట పడేందుకే దేశం ప్రత్యామ్నాయ పార్టీ కోసం ప్రభుత్వం కోసం కాకుండా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం ఎదురు చూస్తుందని ఆయన తెలిపారు.

అటువంటి ఎజెండా ఆవశ్యకతను వెల్లడించినందునే ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కెసిఆర్ వైపు చూస్తుందన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన మహానేత ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన కొనియాడారు. అటువంటి నేత తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ రూపురేఖలు మారి పోయాయన్నారు. ఎటువంటి కొలమానాన్ని పెట్టి చూసినా ఒకటి నుంచి 50 వరకు దేశంలో తెలంగాణానే నెంబర్ వన్ స్థానంలో కనిపిస్తుందని ప్రశంసించారు. అందుకే ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కెసిఆర్ వైపు చూస్తుందన్నారు. దేశానికి కావల్సిన ప్రత్యామ్నాయ ఎజెండా ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ చరిత్ర నిర్మాతలేనని ఆయన అన్నారు. అటువంటి ప్రజల అభీష్టానికి అనువైన ఎజెండాను ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలోనే ప్రకటిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News