Home తాజా వార్తలు 102తో భరోసా..

102తో భరోసా..

People Good Response On 102 Ambulance Services
పెద్దపల్లి:  మాతా శిశు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 102 వాహనాలకు ఏడాది పూర్తి అయింది. గత ఏడాది జనవరిలో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాల ద్వారా జిల్లాలో వేలాది మందికి సేవలు అందాయి. గ్రామీణ ప్రాంతాల గర్బీణీలు, బాలింతలు ప్రసవం పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే క్రమంలో ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేవారు. తర్వాత ఆసుపత్రికి ఆటోల్లో రావాల్సిన పరిస్థితి ఉండేది. కాని 102 వాహనాల ద్వారా నేరుగా ఇంటి నుండి ఆసుపత్రికి, మళ్లీ ఇంటికి చేర్చె వెసులుబాటు అందుబాటులోకి రావటంతో గ్రామీణ కష్టాలు తీరినట్లయింది.
అమ్మఒడిలో భాగంగా….
అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం 2018 జనవరిలో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే 102 అంబులెన్స్ వాహనాలను జిల్లాలో ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గర్బం దాల్చిన మొదటి నెల నుండి ఎ ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రికి తీసుకురావటం, అవసరమైన పరీక్షలు, చికిత్స చేసుకున్నాక ఇంటి తిరిగి చేర్చడానికి ఈ వాహనాలు పని చేస్తున్నాయి. ప్రసవం కోసం కూడ ఆసుపత్రికి తీసుకువెళ్లి, ప్రసవం అయ్యాక ఈ వాహనంలోనే బాలింత ఇంటి వరకు చేరుకోవచ్చు. ఈ సేవలు అన్ని ఉచితంగా అందుబాటులోకి రావటంతో గ్రామీణులు చక్కగా వినియోగించుకుంటున్నారు. 102 కు ఫోన్ చేసి వివరాలు చెపితే చాలు.. వారు సూచించిన ప్రాంతానికి వాహనాలు వస్తున్నాయి. ఇక ప్రసవం తర్వాత పరీక్షలు, పిల్లలకు 9నెలల వయస్సు వరకు ఈ వాహనాల సేవలు ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా నిరుపేదలకు మేలు జరుగుతుండగా, ఇంటి ప్రసవాలు తగ్గి సురక్షిత కాన్పుల సంఖ్య గనణీయంగా పెరిగింది.
వాహనం అవసరమైతే….
వాహనం అవసరమైనపుడు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 102కు డయల్ చేయాల్సి ఉంటుంది. ఇలా 12 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రాత్రి 8 అనంతరం ఉదయం 8 గంటల వరకు వాహనం అవసరమైతే 108 కి కాల్ చేయాలి.
సేవలు ఇలా అందుతాయి…
గర్బం దాల్చిన మహిళలు వైద్య పరీక్షల కోసం అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోవాలంటే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది.
గర్బం దాల్చిన ప్రతి మహిళ తన పేరును ఆశా కార్యకర్త వద్ద నమోదు చేసుకొని 9 నెలల వరకు ప్రతి నెల ఎఎమ్‌సి సెంటర్ కోసం ఇంటి నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి ఈ వాహన సేవలు ఉపయోగించవచ్చు. వైద్య పరీక్షల తర్వాత అదే వాహనంలో ఇంటి వద్ద దింపుతారు.
అల్ట్రాస్కానింగ్, రక్తపరీక్షలు, ఇతర వైద్య పరీక్షలకు రెఫర్ చేసిన గర్బీణీలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సిహెచ్‌సికి తీసుకువెళ్తారు. నెలవారిగా పరీక్షలు చేయించుకోనే గర్బీణిలు, బాలింతలు ఈ వాహన సేవలు వాడుకోవచ్చు.
గర్బీణిలకు మద్యలో ఎదైనా వైద్య పరీక్షలు అవసరమని గుర్తిస్తే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవల అనంతరం ఇంటి వద్ద దింపుతారు.
గర్బం దాల్చినప్పటి నుండి మహిళలు విధిగా వైద్యుల సూచనలు పాటించాల్సి ఉంది. మూడు ఆరు, తోమ్మిది నెలల్లో వైద్యులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకొవడానికి , పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రికి తీసుకువెళ్లడం, మళ్లి ఇంటి వద్ద దింపడం ఈ వాహనం ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.
సౌకర్యంగా ఉంది….
కట్ల స్రవంతి, మొట్లపల్లిగ్రామం, కాల్వశ్రీరాంపూర్ మండలం.
మా బాబు చికిత్స కోసం వచ్చాం. 102 వాహనం కోసం ఫోన్ చేయగానే వచ్చారు. ఇందులో ఆసుపత్రికి రావటం నాకు బాబుకు చాలా సౌకర్యంగా ఉంది. ఆసుపత్రికి వచ్చి వెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బందిగా ఉన్న సమయంలో 102 వాహనం ఎంతో ఉపయోగపడింది.
సేవలు సద్వినియోగం చేసుకోవాలి…
విగ్నేశ్వర్, జిల్లా కోఆర్డినేటర్
జిల్లాలో 102 సేవలు ఉపయోగించుకునే వారి సంఖ్య 5 లక్షల దాక పెరిగాయి. దీని కోసం ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడి కార్యకర్తల సాయంతో పల్లెల్లో అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రస్తుతం 102 సేవలు బాగా నడుస్తున్న మరింత పెరగటానికి కృషి చేస్తాం. గర్బీణీలు, బాలింతలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. మూడు నెలల గర్బీణీల నుండి 9 నెలల శిశువు ఉన్న బాలింత వరకు ప్రతి ఒక్కరు సేవలు ఉపయోగించుకొవచ్చు.

People Good Response On 102 Ambulance Services