Home జాతీయ వార్తలు ‘ఉల్లి’ కోసం బారులు తీరిన జనం…

‘ఉల్లి’ కోసం బారులు తీరిన జనం…

Onion

 

బీహార్ : కోయకుండానే కన్నీల్లు పెట్టిస్తున్న ఉల్లి, ప్రస్తుతం ఉల్లిగ‌డ్డ‌ల ధ‌ర ఆకాశాన్నంటిన విష‌యం తెలిసిందే. బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర స‌హ‌కార మార్కెటింగ్ సంస్థ ఉల్లిగ‌డ్డ‌ల‌ను కిలో 35 రూపాయ‌ల‌కు అమ్ముతున్న‌ది. విషయం తెలుసుకున్న జనాలు ఉల్లిని కొనేందుకు ఎగ‌బ‌డుతున్నారు. తక్కువ ధరకే ఉల్లిగడ్డ దొరుకుతుండటంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినట్లైంది. పాట్నాతో పాటు ఇత‌ర న‌గ‌రాల్లో ఉల్లిగ‌డ్డ‌ల‌ను కొనేందుకు ఉద‌య‌మే జ‌నం బారులు తీరారు. అయితే కొందరు దుండగులు ఉల్లిపాయలను విక్రయించే వారిపై రాళ్లు విసిరి దాడులు చేస్తున్నారు. వారి నుంచి రక్షణ పొందేందుకు తలకు హెల్మెట్ ధరించి ఉల్లిపాయలను విక్రయిస్తున్నామని అధికారులు తెలిపారు. తమకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించలేదు.. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.

People in the queue for Onion at Bihar