Friday, April 19, 2024

డిజిటల్ పేమెంట్‌ల వైపు ప్రజల మొగ్గు

- Advertisement -
- Advertisement -

paytm

 

మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ ఎఫెక్టుతో ఇల్లు దాటి బయటికొచ్చేందుకు 90 శాతం మంది జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ బిల్లులతో పాటు ఇతర పేమెంట్‌లను కట్టడానికి చాలామంది డిజిటల్ చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు డిజిటల్ పేమెంట్ మార్గాలను ఆశ్రయిస్తుండడంతో గేట్ వే సంస్థలు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా, సౌలభ్యంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించడంతో పాటు దానికి తగ్గట్టుగా తగిన మార్పులు చేశాయి.

‘స్టే ఎట్ హోం ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంట్లో ఉండి తమ ఎలక్ట్రిసిటీ, నీళ్లు, ఇతర బిల్లులను సులభంగా చెల్లించేలా పేటిఎం యాప్ పలు మార్పులు చేసింది. ‘స్టే ఎట్ హోం ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్‌ను పేటిఎం యాప్ అందిస్తోంది. ఎపి, తెలంగాణ వాసులు ఇప్పుడు ఎపి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎపిఎస్పిడిసిఎల్), తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిఎస్‌ఎస్పిడిసిఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజీ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) వంటి అత్యవసరాల బిల్లులను పేటిఎం యాప్ ద్వారా చెల్లించేలా ఆ సంస్థ పలు మార్పులను చేసింది.

పేటిఎం యాప్ ద్వారా ఇన్యూరెన్స్ ప్రీమియం చెల్లింపులు
మొబైల్, డిటిహెచ్ రీఛార్జ్, క్రెడిట్ కార్డ్, ఇన్యూరెన్స్ ప్రీమియం చెల్లింపులు కూడా పేటిఎం యాప్ ద్వారా సులభతరం అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్ని బిల్లింగ్ సంబంధిత అవసరాలు ఒక్క వేదికపై సమగ్రం చేసింది. దీంతో సంబంధిత వెబ్‌సైట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వివిధ సర్వీస్ ప్రొవైడర్ల ఐకాన్ల నుంచి కావాల్సిన దాన్ని ఎంచుకునేలా పేటిఎం మార్పులు చేసింది. దీంతోపాటు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునేందుకు ఆప్షన్స్ ఇవ్వగా, బీమా సేవలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ‘బై ఇన్సూ రెన్స్’ ట్యాబ్ ఏర్పాటుచేయగా, అపార్ట్‌మెంట్‌లలో ఉండేవారు మెయింటెన్స్ బిల్లును కొద్ది నిమిషాల్లోనే చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. సొసైటీ/అపార్ట్‌మెంట్ పేటిఎం యాప్‌లో నమోదు కాకున్నా కొన్ని సరళమైన స్టెప్స్ ద్వారా మీరు చెల్లింపులు చేయవచ్చు.

People priority for Digital payments
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News