Friday, March 29, 2024

కోవిడ్-19 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

CoVID19

 

హిమాయత్‌నగర్: ప్రపంచాన్ని వనికిస్తున్న కోవిడ్-19(కరోనవైరస్) సాధారణంగా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఫ్రోపెసర్ పి.శశికళారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్, సరోజినినాయుడు వనితా మహావిద్యాలయం సంయుక్తా ఆధ్వర్యంలో నగరంలో తొలిసారిగా కోవిడ్-19పై అవగాహన సదస్సు, ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వైరస్ దగ్గు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నారు. కేవలం ఈ వ్యాధిని రక్త పరీక్షల ద్వారానే తెలుస్తుందని ఆమె వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ)రాష్ట్ర కార్యదర్శి సంజీవ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. కరోన వైరస్ జ్వరంతో మొదలైనట్లు కనిపించి పొడిదగ్గుతో వారంరోజుల తరువాత శ్వాస ఇబ్బందులకు దారితీస్తుందన్నారు.

ఉస్మానియా జనరల్ ఆసుపత్రి జనరల్ మెడిసన్ విభాగం అసిస్టెంట్ ప్రొపెసర్ డి.శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు తమ చేతులను నీటితో శుభ్రం చేసుకున్న తరువాతనే ముఖాన్ని తాకాలని, నీరసంగా అనిపిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్‌నారాయణ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ డి శభానదేశ్ పాండే, లయన్ ప్రేమ్‌చంద్ మునుత్ జైన్, మేజర్ ఎన్. సుప్రియ, డాక్టర్ ఆర్తీసింహా తదితరులు పాల్గొన్నారు. సభకు ముందుగాఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి విద్యార్థులు ప్లేకార్డులు చేతబట్టి మోజాంజహీ మార్కెట్ నుండి ఎగ్జీబిషన్ మైదానం వరకు వైరస్ నివారణలపై నినాధాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

People should be alert to CoVID19
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News