Home భద్రాద్రి కొత్తగూడెం కొత్త జిల్లాతో కళకళ …… నోట్ల రద్దుతో డీలా

కొత్త జిల్లాతో కళకళ …… నోట్ల రద్దుతో డీలా

Bhadradri

భద్రాచలం : 2016 ముగిసిపోయింది. వినీలాకాశంలో మరో కోత్తఏడు అడుగుపెట్టింది. కష్టసుఖాల దోందరలో కాలం కరిగిపోయింది. నూతన సంవత్సరాన్ని ఆశ్వాదిస్తున్న శుభ వేళ పాత జ్ఞాపకాలను నమెరు వేసుకుంటూ ముందుకు సాగాల్సిందే… తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో భాగంగా ఇవిభక్త ఖమ్మం జిల్లా 2016 అక్టోబర్ 11 నుండి రెండుగా చీలిపోయి భద్రాద్రి కోత్తగూడె  జిల్లాగా అవతరించింది. అంతే కాకుండా జిల్లాలో 21 మండలాలు ఏర్పడ్డాయి.

రాష్ట్రంలో అతిపెద్ద విస్తీర్ణం గల గిరిజన జిల్లాగా భద్రాద్రి జిల్లా అవతరించింది. అదే విధంగా భారత ప్రధాన నరేంద్రమోడి నల్లకుబేరుల భరతం పట్టేందుకు పెద్ద నోట్లయిన రూ.1000, రూ.500 ల నోట్లను రద్దు చేశారు. దీంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నా రు. బ్యాంకుల మందు పడిరాని పాట్లు పడితే సరిపోయే డబ్బుల రాక, వచ్చిన పెద్ద నోట్లకు చిల్లర లేక ఇంటి గాసం ఎల్లక పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనేక పాట్లు పడ్డారు.