మన తెలంగాణ/భూపాలపల్లి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర శాసనసభా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, ఘణపురం, భూపాలపల్లి మండలాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ ప్రాంత ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేదనీ, ప్రజల సంక్షేమమే లక్షంగా గ్రామీణ ప్రాంత పల్లె ప్రజలకు పథకాలు అందాలనే ఉద్ధేశ్యంతోనే అనేక సంక్షేమ ఫలాలను ప్రవేశపెట్టి అందిస్తుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పల్లె పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణలో చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే, కేసీఆర్ చేసే అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్షంగా ప్రభుత్వం పాటుపడుతుందనీ స్పీకర్ తెలిపారు.
ప్రజల అభివృద్ధే పభుత్వ ధ్యేయం
- Advertisement -
- Advertisement -