Home తాజా వార్తలు పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం…

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం…

 Health

 

ఐకమత్యంతో గ్రామంలో స్వచ్ఛత నెలకొల్పాలి
శుభ్రత పాటించకుంటే చర్యలు
రాఘవాపూర్‌ను సందర్శించిన కలెక్టర్ శ్రీదేవసేన

పెద్దపల్లి : పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధించగలుగుతామని, అందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటిస్తూ నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. సచ్ఛ్ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని రాఘవాపూర్ గ్రామాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో సందర్శించారు. గ్రామంలోని పలు ఇండ్ల పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించిన కలెక్టర్ వారికి పరిశుభ్రత పాటించేలా సూచనలు చేశారు. గ్రామస్తులంతా ఐక్యంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల ని, గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

గ్రామ స్వచ్ఛత పట్ల నిర్లక్షంగా వ్యవహరించే వారి ఇళ్లకు కరెంట్ కట్ చేసి దారికి వచ్చే లా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ను సందర్శించిన కలెక్టర్ తరగతిగదిలో ఫ్లోరింగ్ నాణ్యత లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత మరమ్మతు పనులు వారంరోజుల్లో పూర్తి చేయాల ని, నాణ్యతలోపంగా పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని పలువురు వృద్ధులు తమకు పింఛన్ రావడంలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఆమె అర్హులైన వారికి ఆసరా పింఛన్ మం జూరు చేయాలని ఎంపిడిఓను ఆదేశించారు. అనంతరం గ్రామంలో నిర్వహించి న గ్రామసభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ స్వచ్ఛత మన జీవన విధానంలో భాగం కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామన్నారు. గ్రామంలో ఉన్న గోదాంలు, రైస్‌మిల్లర్ల నుంచి వృథా నీరు బయటికి విడుదల కాకుండా ప్రత్యమ్నా య చర్యలు చేపట్టేలా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలన్నా రు. గ్రామం స్వచ్ఛంగా ఉండేందుకు సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు కృషి చేయాలని, ప్రతి రోజు సంబంధించిన వార్డుల్లో పర్యటిస్తూ పరిశుభ్రత పట్ల ప్రజలకు నిరంతరం వివరిస్తూ ఉండాలని, గ్రామంలో చెత్తను బయటవేయడానికి వీలులేద ని, అలా చేస్తే భారీ స్థాయిలో జరిమానా విధించాలని కలెక్టర్ సూచించారు.

గ్రామంలో ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడుగుంత, సోప్‌పిట్ నిర్మాణం జరిగే లా చర్యలు తీసుకోవాలని, మరో పది రోజుల్లోపు నిర్మాణాలు పూర్తి చేయాలన్నా రు. గ్రామస్తులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకై గ్రా మంలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను విధిగా సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి.సుదర్శన్, జిల్లా పౌరసంబంధాల అధికారి వి.శ్రీధర్, ఎంపిడివో రాజు, సర్పంచ్ వెంకటేష్ తదితరలున్నారు.

Perfect Health with Cleanliness of Surroundings