Home స్కోర్ వెయిటర్ సలహాతోనే ఆటతీరు మెరుగు : సచిన్

వెయిటర్ సలహాతోనే ఆటతీరు మెరుగు : సచిన్

sachinన్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌ను శాసించిన సచిన్ ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. క్రికెట్ ప్రస్థానంలో చిరస్మణీయమైన రికార్డులు సాధించి తనదైన ముద్ర వేశాడు. అయితే తన ఆట తీరు మెరుగుపడడానికి ఒక వెయిటర్ ఇచ్చిన సలహానే ప్రధాన కారణమని సచిన్ తెలిపాడు. ‘ఒకానొక సమయంలో  చెన్నైలో  నా వద్దకు వచ్చిన ఒక వెయిటర్ ఓ సలహా ఇచ్చాడు. నా ఎల్బో గార్డ్‌ను మార్చుకుంటే మీ బ్యాటింగ్ మెరుగుపడుతుందని అతను సూచించాడు. అతను చెప్పింది వంద శాతం నిజం. నేను తీసుకునే ఎల్బోగార్డ్‌తో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది.  ఆ విషయం నాకు చాలాసార్లు అనిపించింది కూడా. అయితే సదరు వెయిటర్ సలహా చెప్పిన తర్వాత నా ఎల్బోగార్డ్‌లో మార్పులు చేసుకున్నాను. ఆ సలహాతోనే నా బ్యాటింగ్ మరింత మెరుగపడింది’ అని సచిన్ గుర్తుకు చేసుకున్నాడు. మనకు ఎవరు సలహా చెప్పినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. మంచి సలహా అనేది ఆ వ్యక్తి హోదాను బట్టి ఉండదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని ఈ సందర్భంగా క్రికెట్ దేవుడు పేర్కొన్నాడు. మన దేశంలో పాన్‌వాలా దగ్గర్నుంచీ కంపెనీ సిఇఒ వరకూ అందరూ సలహాలు ఇస్తారని, వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నాడు.