Wednesday, April 24, 2024

చిరంజీవిని ఒంటరి చేయలేదా? పవన్: పేర్ని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మేలు కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని ఎంఎల్‌ఎ పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబును కాపాడటానికే వెళ్తున్నానని పవన్ అంటున్నాడని, పవన్ కల్యాణ్ నిస్సిగ్గుగా కుల రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. 2014లోపు కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర పెట్టావని, బాబుకు దమ్ము లేక పవన్‌ను వాడుకుంటున్నాడని విమర్శించారు. విడివిడిగా కాదు కలిసి రావాలని, అందర్ని చిత్తగొట్టి ఇంటికి పంపిస్తామని పేర్ని సవాలు విసిరారు.

బాబు పక్కన చేరి ముసుగు తీసినందుకు పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అసత్యాలు మాట్లాడుతుండడంతో పాటు కాపులను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నాడని, చంద్రబాబు కోసం పవన్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాడని, నాయకత్వ లక్షణాలు లేవన్నారు. చిరంజీవిపై పవన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేయలేదా?, పిఆర్‌పి ఓటమి తరువాత చిరంజీవిని ఒంటరిని చేయలేదా?, పార్టీ పెట్టి మూసింది ఎవరు? అని, రాజకీయం కోసం అన్న అని కూడా చూడవా? అని ధ్వజమెత్తారు. పవన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News