Home తాజా వార్తలు బావి దగ్గర చెట్టుకు ఉరేసుకుని రైతు ఆత్మహత్య

బావి దగ్గర చెట్టుకు ఉరేసుకుని రైతు ఆత్మహత్య


మనతెలంగాణ/చేగుంట: బావి దగ్గర చెట్టుకు ఉరేసుకుని రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్నశివునూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. గురువారం రోజు కుటింబికులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడియారం గ్రామానికి చెందిన కొండల్‌రెడ్డి అనే రైతు (50) ఆరు రోజులుగా కనిపించక పోవడంతో చుట్ట ప్రక్కల వెతికిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ రోజు తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.