జగిత్యాల: సంతానం కాలగడం లేదని ఓ వ్యక్తి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెట్ పల్లి పట్టణంలో చోటు చేసకుంది. పోలీసుల కథనం ప్రకారం… జిల్లాలోని మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కు చెందిన చోరపాక అనిల్ కుమార్(35) అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల క్రితం శ్రీలత అనే మహిళతో వివాహం జరిగింది. ఎన్ని దవాఖానలకు తిరిగిన ఇప్పటి వరకు పల్లలు పుట్టడం లేదని గత కొంతకాలం నుంచి అనిల్ మానసికంగా బాధ పడుతున్నాడు. ఈ క్రమంలోనే అనిల్ ఆదివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతని గమనించిన కుటుంబ సభ్యులు అనిల్ ను హుటాహుటిన నిజామాబాద్ సర్కార్ దవాఖానకు తరలించారు. అనిల్ చికిత్స పొందుతూ.. సోమవారం చనిపోయాడు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపారు.