Home జనగామ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

Person dead

 

జనగామ: జాతీయరహదారిపై టాటా ఎసి ట్రాలీ ఆటో ఓ బైక్‌ను వెనుక నుంచి ఢీకొన్నడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన కుంచం శ్రీనివాస్ (40) గత మూడేళ్లుగా నవాబ్‌పేట రిజర్వాయర్ కాల్వ పనులు చేసుకుంటూ జీవనం కొన్నసాగిస్తున్నాడు. పనుల నిమిత్తం బైక్‌పై స్టేషన్‌ ఘన్‌పూర్ నుంచి జనగామకు వస్తుండగా వెనక నుంచి వస్తోన్న స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన కండలోజు రవికుమార్ డ్రైవర్ తన టాటా ఏసీ ట్రాలీ ఆటో వేగంగా వస్తూ ఢీకొట్టడంతో బైక్‌పై వస్తున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చారికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person dead in Road Accident in Jangaon