Monday, June 5, 2023

ప్రియురాలి ఇంట్లో ప్రియుడి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

వివాహితతో ఏడాదిగా అక్రమ సంబంధం
హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరణ?
ప్రియుడి ఇంట్లోనే ఏడాదిగా అద్దెకు
గుర్తించి హెచ్చరించి ఇల్లు ఖాళీచేయించిన యువకుడి కుటుంబ సభ్యులు
పండుగకు వచ్చి ప్రియురాలి ఇంట్లో అనుమానాస్పద మృతి

 

 

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రియురాలి ఇంట్లో ప్రియుడి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. ప్రియురాలి ఇంట్లో బుసిరెడ్డి శరత్ కుమార్ రెడ్డి (25) అనే అవివాహిత యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో బుసిరెడ్డి చంద్రారెడ్డి నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లో తీగలపల్లి కి చెందిన సురేష్ రెడ్డి  అద్దె కు ఉండేవాడు. ఇదే క్రమంలో శరత్ కుమార్ రెడ్డికి సురేష్ రెడ్డి భార్య కళ్యాణి తో అక్రమ సంబంధం ఏర్పడినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు సురేష్ రెడ్డి ఇంటిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం వారు అదే వీధిలోని భాస్కర్ రావు ఇంట్లో రెండు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళిన శరత్ కుమార్ రెడ్డి కళ్యాణి ఇంట్లో బెడ్ రూం లో నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు స్నేహితులు శరత్ కుమార్ రెడ్డికి ఫోన్ చేయగా కళ్యాణి ఫోన్ ఎత్తి విషయం చెప్పి ఇంటికి రావాలని చెప్పింది. వారు వెళ్ళే సరికి అపస్మారక స్థితిలో ఉండడంతో విషయాన్ని మృతుడి సోదరుడికి తెలిపారు.

వారు వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఇదిలా ఉండగా కళ్యాణి చెబుతున్న మాటలకు సంఘటనకు పొంతన లేకుండా ఉందని సమాచారం. ఇంటికి వచ్చిన శరత్ తలుపు తెరిచిన వెంటనే బెడ్ రూంలోకి వెళ్ళాడని సెల్‌ఫొన్ హెడ్‌ఫోన్స్ కేబుల్ తో మెడకు చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ముందు కళ్యాణి చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అక్రమ సంబందాన్ని చూసిన భర్త పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శరత్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక హత్య చేశారా ? లేదా సదరు మహిళతో శారీరకంగా పాల్గొనే క్రమంలో గుండెపోటుతో మృతి చెందాడా ? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడి ప్యాంటుపై వీర్యం మరకలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఘటనా సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు. కళ్యాణి తో పాటు వారి ఇద్దరి పిల్లలు, భర్త ఎక్కడ ఉన్నారు. అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అదే విధంగా కళ్యాణి నివాసంలో బెడ్ పై శరత్ పడి ఉండగా ఫ్యాన్‌కు చున్ని వేళాడుతున్న విషయాన్ని మృతుడి స్నేహితులకు కళ్యాణి చూపించినట్లు తెలిసింది. మూడవ అంతస్థులో నుంచి స్నేహితులు కిందికి వచ్చి శరత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వచ్చే లోపే ఫ్యానుకు వేలాడుతున్న చున్నిని తొలగించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే ఫ్యానుకు చున్ని వేలాడతీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరుచూ కళ్యాణి భర్త సురేష్ రెడ్డి శరత్ కుమార్ రెడ్డి తో కలిసి మద్యం సేవించేవారని మృతుడి తమ్ముడు తెలిపారు. ముమ్మాటికి ఇది హత్యేనని అతను ఆరోపించాడు. కళ్యాణికి ఇద్దరు సంతానం ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా దేశంలోనే సంచలనం రేకెత్తించిన స్వాతి భర్త మర్డర్ కేసు వ్యవహారం మరువక ముందే ఆ పక్క వీధిలోనే ఈ సంఘటన వెలుగు చూడడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. పోలీసు దర్యాప్తులో సంఘటన అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంఘటన పై మృతుడి తండ్రి బుసిరెడ్డి చంద్రా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు.

Person died in Lover bedroom in NagarKurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News