Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Person Died In Road Accident In Vikarabadవికారాబాద్ : పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి తండా గ్రామ సమీపంలో  గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ ట్రాక్టర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇందూరు గ్రామానికి చెందిన జెల్ల లక్ష్మప్ప (55) అనే వ్యక్తి చనిపోయాడు. లక్ష్మప్ప ఇందూర్ నుంచి తాండూర్ వైపు బైక్ పై వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మప్ప మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.