Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వ్యక్తి దారుణ హత్య

వ్యక్తి దారుణ హత్య

Murderతూర్పుగోదావరి :  అయినవిల్లి మండలం సిరిపల్లి గౌడకాలనీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న వెలిగట్ల వీరవెంకట సత్యనారాయణ(32) అనే వ్యక్తిపై దుండగులు  మారణాయుధాలతో దాడి చేసి నరికి చంపారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అక్రమ సంబంధం కారణంగానే వీరవెంకట సత్యనారాయణను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శవపరీక్ష కోసం వీరవెంకట సత్యనారాయణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Murder at East Godavari