Home తాజా వార్తలు జనగాంలో వ్యక్తి దారుణ హత్య

జనగాంలో వ్యక్తి దారుణ హత్య

Person murder in Janagamయాదాద్రిభువనగిరి : సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలోని జనగాంలో ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం గ్రామానికి చెందిన గాలయ్య (50) పని నిమిత్తం బైక్‌పై సంస్థాన్‌నారాయణపురం వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా జనగాం గ్రామ సమీపంలో మాటేసిన దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గాలయ్యను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గాలయ్య చనిపోయాడు. ఘటనాస్థలిని ఎస్‌ఐ నాగరాజు పరిశీలించారు. మూడు నెలల క్రితమే గాలయ్య ముంబయి నుంచి వచ్చాడని ఎస్‌ఐ తెలిపారు. గాలయ్య హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెల్లడించారు. గాలయ్య మృతితో జనగాంలో విషాదం అలుముకుంది.