Home Default చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య

చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య

Murderరాంచీ : మంత్రాలతో చేతబడి చేస్తున్నాడన్న నెపంతో సాహ్ నాయి ఓరాన్ (52) అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటన జార్ఖండ్ రాష్ట్రం లోహర్ దగా జిల్లా జాల్జామేద్రా గ్రామంలో జరిగింది. సాహ్ నాయి ఓరాన్ చేతబడి చేస్తున్నట్టు గ్రామ ప్రజలు అనుమానించేవారు. గ్రామానికి చెందిన బీర్సా ఓరన్ అనే వ్యక్తి చనిపోయాడు. బీర్సా అంత్యక్రియలకు గ్రామ ప్రజలందరూ హాజరు కాగా, సాహ్ నాయి మాత్రం హాజరు కాలేదు. దీంతో అతడు చేసిన చేతబడి వలనే బీర్సా చనిపోయాడని గ్రామ ప్రజలు అనుమానించారు. బీర్సా అంత్యక్రియల అనంతరం గ్రామ ప్రజలు సాహ్ నాయి ఓరాన్ పై మూకుమ్మడి దాడి చేసి రాళ్లతో కొట్టి చంపారు. పోస్టుమార్టం కోసం సాహ్ నాయి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సాహ్ నాయి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Murder In Jharkhand