Home వనపర్తి వ్యక్తిత్వ వికాస నిపుణులు చంద్రశేఖర్

వ్యక్తిత్వ వికాస నిపుణులు చంద్రశేఖర్

Wanaparthy

అమరచింత: మనిషి విజయాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసం నమ్మకం అత్యంత కీలకమని ప్రముఖ వ్యక్తిక్త వికాస నిపుణులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యా ర్థులకు అవగాహణ కల్పించారు. 10వ తరగతిలో విజయం సాధించేందుకు చంద్రశేఖర్ 10 మహో న్నత సూత్రాలపై విద్యార్థులకు అవగాహణ కల్పించారు. నెగటివ్‌గా ఆలోచించడం , మాట్లాడ టం, వినడం, మానివేయాలని ఆయన అన్నారు.

మనిషి ఆలోచనలు ఎలా ఉంటే అలాగే తయారవు తారని ఆయన అన్నారు. ఆత్మన్యూనతా భావం మనల్ని మనం తక్కువ చేసుకోవడం, ప్రమాధకర మని ఆయన అన్నారు. మనస్సు చెత్త బుట్ట కాదని, మన శక్తిని చెత్త సీరియల్ చూడడానికి ఉపయో గించరాదని అన్నారు. 10వ తరగతి పరీక్షలో 10/10 సాధించాలంటే తీవ్రమైన కోరిక ఆచరణ, ఆత్మవిశ్వాసం వంటివి అవసరమని ఆయన అన్నారు. పరీక్షల సమయంలో ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అసాధ్యాన్ని, సుసాధ్యం చేసుకోవడం మనిషొ యొక్క లక్షం అన్నారు. ఎప్పుడు కూడా నిరుత్సాహ పరిచే వ్యక్తు లతో కాకుండా ప్రోత్సహించేవారిపై సన్ని హితంను పెంచుకోవాలని అన్నారు. దీని వల్ల జీవితంలో అనుకున్న లక్షాలను చేరుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు సుధాకర్, రాజశేఖర్ , హెచ్‌ఎం నాగేం ద్రమ్మ, ఉపాధ్యాయులు, ఎం శ్రీనివాసులు, బషీర్‌అహ్మద్, అక్తర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.