Thursday, April 18, 2024

ముఖం చూసి వ్యక్తి గుట్టు బయటకు..

- Advertisement -
- Advertisement -

 Technology

 

చైనాలో ముఖం చూసి వ్యక్తుల గుట్టుమట్టులు తెలుసుకోగల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వచ్చింది. దేశంలో మొట్టమొదటిసారి ఈ వ్యవస్థను హాన్‌వాంగ్ టెక్నాలజీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. మాస్క్‌లు ధరించినా ధరించక పోయినా అవతలి వ్యక్తి ఎవరో ఆయన శరీర తత్వం ఏమిటో కొన్ని క్షణాల్లోనే ఇది పసిగట్ట గలుగుతుంది. ఈ సంస్థకు చెందిన బృందం పదేళ్ల పాటు శ్రమించి ఈ టెక్నాలజీని రూపొందించారు. గత జనవరి నుంచి దీని పైనే వీరు పనిచేస్తున్నారు. మాస్క్ లేని ఆరు మిలియన్ల మంది, మాస్క్ ఉన్న కొద్దిమంది నమూనా డేటాతో రూపొందిన ఈ టెక్నాలజీ జనసమూహంలో సెకనుకు 30 మంది వంతున ప్రతి ఒక్కరినీ గుర్తించ గలుగుతుంది. మాస్క్ ధరిస్తే గుర్తించే 95 శాతం, మాస్క్ ధరించక పోతే 99.5 శాతం గుర్తింపు సామర్థంలో కచ్చితత్వం ఉంటుందని, హాన్‌వాంగ్ సంస్థ ఉపాధ్యక్షుడు హుయాంగ్‌లీ ఒక ఇంటర్వూలో చెప్పారు. ఈ సంస్థ ప్రధానంగా రెండు రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది.

ఒకటి సింగిల్ ఛానల్ గుర్తింపు కాగా, రెండోది అతి శక్తివంతమైన మల్టీ ఛానల్ గుర్తింపు. సింగిల్ ఛానల్ గుర్తింపు కొంతవరకే పరిమితం. ఉదాహరణకు ఆఫీస్ భవనాల్లో ప్రవేశించేటప్పుడు దీన్ని వినియోగిస్తుంటారు. మల్టీ ఛానల్ లో అనేక నిఘా కెమెరాలు పనిచేస్తాయి. జనబాహుళ్యంలో ఎవరినైనా కొన్ని క్షణాల్లో గుర్తిస్తాయి. ఈ టెక్నాలజీకి టెంపరేచర్ సెన్సార్‌ను అనుసంధానిస్తే శరీర ఉష్ణోగ్రతను బట్టి మనిషి పేరును వ్యక్తి గత వివరాలు వెల్లడవుతాయి. శరీరంలో 38 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అయితే ఎవరైనా మాస్క్‌తోపాటు సన్‌గ్లాస్‌లు ధరిస్తే గుర్తింపు ప్రక్రియ క్లిష్టమవుతుందని హుయాంగ్‌లీ చెప్పారు. ఈ సమయంలో కీలక మైన ముఖానికి సంబంధించిన సమాచారం అంతా తుడిచిపెట్టుకు పోతుందని తెలిపారు.

ఇప్పుడు ఈ ఉత్పత్తులకు పెద్ద వినియోగదారులు ఎవరంటే ప్రజాభద్రతను పరిరక్షించే మంత్రిత్వ శాఖే. పోలీస్ యంత్రాంగం ఈ శాఖ అజమాయిషీలో ఉంటుంది కాబట్టి తన స్వంత డేటాతో ఈ టెక్నాలజీని అనుసంధానించి వ్యక్తుల గుర్తింపు పోలికలను సరిచూడవచ్చు. నేర పరిశోధనలో అనుమానితులను, చివరికి ఉగ్రవాదులను కూడా సులువుగా గుర్తించ వచ్చు. వ్యక్తి నోటిని గుర్తించి వివరాలు తెలుసుకోవడమేకాక, కళ్లు, ముక్కు పైభాగం గుర్తించి పూర్తి వివరాలు రాబట్ట గలుగుతారు. బీజింగ్‌లో ఈ టెక్నాలజీని ఉపయోగించే క్లయింట్లు పోలీస్‌తో సహా 200 మంది వరకు ఉన్నారు. ఈ ముఖాల గుర్తింపు వ్యవస్థను చూనా అధికార యంత్రాంగం వినియోగం లోకి తీసుకు వస్తోంది.

కృత్రిమ మేధో పరిజ్ఞానం సహాయంతో అనేక వేల సిసిటివి కెమెరాలకు అనుసంధానించి లక్షాలను సాధించడానికి ప్రయత్నిస్తోంది. త్వరలో చైనా లోని 20 ప్రావిన్సుల్లో ఈ టెక్నాలజీ విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఒక్క చైనా లోనే కాదు మిగతా దేశాల్లోనూ కరోనా వైరస్ నేపథ్యంలో వ్యక్తిగత ఆరోగ్యాని కూడా గుర్తించే అవసరం ఉన్నందున మిగతా దేశాలు కూడా ఈ టెక్నాలజీని వాడుకోడానికి మొగ్గు చూపుతారని హాన్‌వాంగ్ సంస్థ ఆశాభావం వెలిబుచ్చింది. ఈ టెక్నాలజీ బాగా వాడుక లోకి వస్తే వేలిముద్రల గుర్తింపు వ్యవస్థ వెనుకబడినట్టే.

 

Persons behaviour identify by with Technology
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News