Home రంగారెడ్డి జింక మాంసంతో పట్టు పడ్డ ఏడుగురు వ్యక్తులపై కేసు

జింక మాంసంతో పట్టు పడ్డ ఏడుగురు వ్యక్తులపై కేసు

Deer-Meatధారూర్ : జింక మాంసంతో పట్టు బడ్డ ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన సంఘటన ధారూర్ అటవీ శాఖ సెక్షన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. డిప్యూటి రేంజ్ అధికారి యూసుఫ్ పాషా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… ధారూర్ మండల పరిధిలోని లక్ష్మీనగర్ తాండకు ఇస్లావత్ శంకర్ తన పొలము దగ్గర జింకల వేటాడడానికి కన్య (ఉరి) బిగించి స్టేషన్ ధారూర్‌కు చెందిన తన స్నేహితులు బావుసింగ్, డి.నర్సింగ్,తుల్‌చ్యా, నందు, ఎం నర్సింగ్, ఓబ్యా లతో కలిసి మంగళవారం రాత్రి జింకను వేటాడి పట్టుకున్నారు. జింకను చంపిస్నేహితులు అందరు పాళ్ళు వేసుకుని పంపిణి చేసుకుంటుండగా రాత్రి 11.30 గం॥ల ప్రాంతంలో బీట్ కోసం వెళ్ళిన అటవీ అధికారులు ఎం డి యూసుఫ్, హమ్మద్‌షరీఫ్ ఇతర స్ట్రైకింగ్ ఫోర్సుకు జింక మాంసం వండుతున్నారనే సమాచారం రావడంతో ఇండ్ల దగ్గర దాడులు చేశారు. అటవీ శాఖ అధికారులు వెళ్ళే లోపు వేటగాళ్ళు మిగతా జింక మాంసము తెలిసిన వ్యక్తులకు పంపిణి చేయగా ఏడుగురు వ్యక్తులు మాంసంతో పట్టు బడ్డారు. వారి దగ్గర రెండు కెజిల మాంసం పట్టుబడడంతో ఏడుగురు పై కేసు నమోదు చేసి రూ. 50 వేలు జరిమాన విధించామని ధారూర్ అటవీ శాఖ అధికారులు తెలిపారు.