Home జాతీయ వార్తలు చిరుతను తరిమికొట్టిన ‘టైగర్’

చిరుతను తరిమికొట్టిన ‘టైగర్’

Dog-saves-ownerకోల్ కతా: బుక్కెడు అన్నం పెడితే యజమాని పట్ల కుక్క కున్న విశ్వాసం మరో సారి రుజువైంది. చిరుతపులి దాడి నుంచి తన యజమానురాలిని కుక్క కాపాడిన సంఘటన డార్జిలింగ్ సమీపంలోని సోనాడలో చోటుచేసుకుంది. ఆగస్టు 14వ తేదీన ఇంటి కింద ఫ్లోర్ లోకి చిరుతపులి వచ్చి తన తల్లిపై దాడి చేసిందని బాధితురాలి కుమారై చెప్పింది. ఆ సమయంలో ‘టైగర్’ అనే తమ పెంపుడు కుక్క చిరుతపులిని ధీటుగా ఎదుర్కొని తరిమేసిందని తెలిపింది. అయితే చిరుతపులి దాడిలో యాజమానురాలు తీవ్రంగా గాయపడింది.

దీంతో చికిత్స నిమిత్తం ఆమెను తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై నెటింట్లో నెటిజన్లు పలురకాల కామెంట్స్ చేస్తున్నారు. సామాన్యంగా ఎవరినైనా ఒరేయ్ కుక్క అని ఎగతాళి చేస్తాం కాదా..? అయితే రాజ్ అనే నెటిజన్ అలా పిలిచి కుక్క పరువు తీయవద్దని కామెంట్ చేశాడు. జంతువుల్లో కుక్క మాత్రమే మానవులతో స్నేహంగా ఉంటుదని చౌకీదార్ సుదర్శన్ అనే వ్యక్తి కామెంట్ పెట్టాడు.

Pet Dog saves owner from leopard in Darjeeling