Thursday, April 25, 2024

ఇండియా పేరు మార్చాలన్న పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

petition dismissal to rename India as Bharat

న్యూఢిల్లీ : ఇండియా పేరును భారత్‌గా మార్చాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, కావాలనుకుంటే ఈ ఫిర్యాదును కేంద్రానికి అందజేయాలని సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమహా ఇండియా పేరును భారత్ లేదా హిందుస్తాన్‌గా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణకు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఇండియాను ఇప్పటికే భారత్ అని పిలుస్తున్నారని తెలిపింది. అయినా ఈ విషయంలో తాము కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది.

petition dismissal to rename India as Bharat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News