Friday, March 29, 2024

సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యేల పిటిషన్

- Advertisement -
- Advertisement -

Petition of Maharashtra BJP MLAs in SC against suspension

న్యూఢిల్లీ: అసెంబ్లీ స్పీకర్ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణతో మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు తమ సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ భాస్కర్ జాదవ్ పట్ల ఆయన ఛాంబర్‌లోనే అమర్యాదకరంగా వ్యవహరించారని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా జులై 12న 12 మంది బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ 12 మంది ఎమ్మెల్యేల తరఫున తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఏడాది పాటు తమను సస్పెండ్ చేస్తూ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని వారు సవాలు చేశారని ఆయన చెప్పారు. వీరి సస్పెన్షన్ తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.

Petition of Maharashtra BJP MLAs in SC against suspension

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News