Saturday, April 20, 2024

జిఎస్‌టి పరిధిలోకి పెట్రోల్, డీజిల్?

- Advertisement -
- Advertisement -
Petrol and diesel covered under GST
17న జరిగే జిఎస్‌టి కౌన్సిల్ భేటీలో చర్చ
ఇది జరిగితే పన్నుల విషయంలో కేంద్ర, రాష్ట్రాలు రాజీ పడవల్సి ఉంటుంది

న్యూఢిల్లీ : జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకొచ్చే విషయంపై ఈ నెల 17న (శుక్రవారం) జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పరిశీలించనున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. వీటికి పరిష్కారంగా ఈ ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెస్తే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెట్రో ఉత్పత్తులపై పన్నులు విధిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు రాజీ పడాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర మంత్రులతో కూడిన కౌన్సిల్ శుక్రవారం లక్నోలో సమావేశం కా నుంది. కరోనాకు సంబంధించిన వస్తువులపై పన్ను మినహాయింపు గడువు సమయం పొడిగించే విషయమై భేటీలో పరిశీలనకు రానుంది. ఈమేరకు అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News