Home జాతీయ వార్తలు 60 పైసలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

60 పైసలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and Diesel price rise in Indiaఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.  ఎనబై రోజుల తరువాత వీటి ధరలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో లీటరుకు రూ.60 పైసలు పెరిగింది. గత మార్చి 16న చివరిసారిగా ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం స్పెసిఫిక్ ఎక్సైజ్ డ్యూటీ విధించడంతో మార్చి 14న లీటర్‌పై మూడు రూపాయలు పెరిగింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నష్టాలు వస్తాయన్న కారణంతో తగ్గిన ధరలతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేపట్టలేదు.

వివిధ నగరాల్లో పెరిగిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.74.61, డీజిల్ ధర రూ.68.42గా ఉంది. ముంబయిలో పెట్రోల్ రూ.78.91, డీజిల్ రూ.68.79గా ఉంది. అదేవిధంగా ఢిల్లీలో పెట్రోల్ రూ.71.86, డీజిల్ రూ.69.79, గురుగావ్‌లో పెట్రోల్ రూ.71.68, డీజిల్ రూ.63.65గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ.74.18, డీజిల్ ధర రూ.66.54గా ఉంది. చెన్నయ్‌లో రూ.76.07, డీజిల్ రూ.68.74గా ఉంది.