Friday, April 19, 2024

వారంలో ఐదోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol and diesel prices hiked 5th time in week

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సోమవారం పెట్రోల్ లీటర్ ధర 26పైసలు, డీజిల్ ధర.33 పైసలు పెంచుతున్నట్టు ప్రభుత్వరంగ చమురు సంస్థలు ప్రకటించాయి. దాంతో, పెట్రోల్ లీటర్ ధర రూ.100 మార్క్ దాటిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర చేరింది. ఇప్పటికే ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 18 రోజులపాటు చమురు ధరలు పెంచకుండా స్థిరంగా కొనసాగించారు. మే 4న మొదటిసారి ధరలు పెంచారు. ఇప్పటివరకు ఈ నెలలో ఐదుసార్లు ధరలు పెరిగాయి. దాంతో, ఈ వారంలో లీటర్ పెట్రోల్ ధర రూ.1.14,డీజిల్ ధర రూ.1.33మేర పెరిగింది.
సోమవారం మహారాష్ట్రలోని పర్భనీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.20కి చేరింది. రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్‌లో రూ.102.42కు, మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో రూ.102.12కు చేరింది. భోపాల్‌లో రూ.99.55కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.53కు, డీజిల్ ధర రూ.82.06కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.13కు, డీజిల్ ధర రూ.89.47కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండటానికి ఆయా రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను(వ్యాట్), ఇతర పన్నులు వేర్వేరుగా ఉండటమేనన్నది గమనార్హం. కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో రికార్డు స్థాయిలో ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.21.58, డీజిల్ ధర రూ.19.18మేర పెరిగాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News