Home తాజా వార్తలు పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ వడ్డింపు

పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ వడ్డింపు

Petrol and diesel prices hiked by 35p per litre in delhi

 

లీటరుకు 35 పైసల చొప్పున పెంపు

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండవరోజు కూడా పెరిగాయి. లీటరుకు 35 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శ్రీనగర్ నుంచి చెన్నై వరకు లీటరు డీజిల్ ధర రూ. 99 దాటేసింది. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో లీటరు పెట్రోల్ రూ. 106.54కు చేరుకోగా ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 112.44గా నమోదైంది. ముంబయిలో లీటరు డీజిల్ రూ. 103.26కు చేరుకోగా ఢిల్లీలో ఇది రూ. 95.27కు పెరిగింది. అక్టోబర్ 18, 19 తేదీలలో చమురు ధరలలో ఎటువంటి పెరుగుదల లేనప్పటికీ బుధవారం 35 పైసల చొప్పున పెరిగింది. దేశంలోని అనేక నగరాలలో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటేసినప్పటికీ డీజిల్ ధర మాత్రం వందకు చేరువలో ఉంది. శ్రీనగర్‌లో డీజిల్ ధర రూ. 99.14 ఉండగా చెన్నైలో అది రూ. 99.59కి చేరుకుంది. దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 118.59 ఉండగా లీటరు డీజిల్ ధర రూ. 109.41కు చేరుకుంది.

Petrol and diesel prices hiked by 35p per litre in delhi